
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: బుధవారం రోజున జరగనున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా పోలీస్ అధికారి అశోక్ కుమార్ లతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై
సంబంధిత అధికారులతో పరిశీలించారు. సభా వేదిక, విద్యుత్, ఇతర ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, నీడ సదుపాయాలుతగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశాన్ని దృష్టిలోఉంచుకొని
భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలనిసంబంధిత శాఖలను ఆదేశించారు. సభను సజావుగా,విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతోపనిచేయాలని
అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రతిష్ఠకు తగిన విధంగా ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎమ్మార్వో, ఎంపిడివో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.