
తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల రూరల్ మండలం క్రైమ్ రిపోర్టర్ దొమ్మటి శశాంక్.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు లో ఘోర రోడ్డు ప్రమాదం, హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది. క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి, తీవ్ర గాయాలైన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.