తేది:20-01-2026 తెలంగాణ TSLAWNEWS ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
రాజ్యాంగ ఫలాలను పొందడం మన అందరి జన్మ హక్కు – సీనియర్ అడ్వకేట్ సంతోష్ కుమార్ గౌడ్.
గ్రామ గ్రామాల్లో అణచివేతను రూపుమాపడానికి మీ ముందుకు వస్తుంది ఏఐబిసిఎఫ్ – బిఎస్ పి మెదక్ జిల్లా అధ్యక్షులు నగు లూరి స్వామి దాస్.
హైదరాబాద్: ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కార్యాలయంలో ఏఐబిసిఎఫ్ సభ్యత్వ నమోదు గురించి సీనియర్ అడ్వకేట్ సంతోష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మనిషి మనిషినిగా గుర్తించడానికి, గుర్తింపు దక్కడానికి, రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరడానికి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ పుట్టుకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడానికి, అట్టడుగు అణగారిన వర్గాల వారికి ఉద్ధరించడానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి AIBCF ఒక మంచి సమావేశ వేదిక, ఇందులో సభ్యత్వ నమోదు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకుందామని, అందరికీ రాజ్యాంగ ఫలాలను అందే విధంగా చూద్దామని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారు, మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ గొల్లపల్లి సాయ గౌడ్, సీనియర్ అడ్వకేట్ సంతోష్ కుమార్ గౌడ్, మరియు ఏఐబిసిఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.