ప్రస్తుతం టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2023 గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. టెక్నాలజీ మానవ జీవితాన్ని సులభతరం చేయని ప్రాంతమంటూ ఉందన్నారు. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్ తదితర రంగాల్లో టెక్నాలజీ మన సామర్థ్యాలను మెరుగుపరుస్తోంది. రక్షణ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.