కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి బయట నుంచి రాలేదన్నారు. ఏడు సార్లు గెలిచానని, కాంగ్రెస్ను ఎప్పుడూ వీడలేదని అన్నారు. పార్టీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పానన్నారు. సొంత ఇమేజ్, ట్రాక్ రికార్డు, విధేయతలను అధిష్టానం పరిగణనలోకి తీసుకుని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాలన్నారు. ఫలితాలు వచ్చి 48 గంటలు దాటలేదని, సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సారం లేదని చెప్పారు.