తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఆదివాసి దళిత హక్కుల రాష్ట్ర వ్యవస్థాపకులు కురిసెంగ వేణు సోమవారం సాయంత్రం బీజేపీలో చేరారు. రాయికల్ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందని, అందుకే బీజేపీలో చేరినట్లు వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, మోడీ అభిమానులు పాల్గొన్నారు.