తేది:20-01-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులో సోమవారం పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. గ్రామ శివారులోని మార్కెట్ యార్డ్ సమీపంలో పేకాట ఆడుతుండగా CCS, జగిత్యాల పోలీసు వారికి పట్టుబడ్డారు. దీంతో వారి వద్దనున్న రూ. 8,150 నగదును స్వాధీనం చేసుకొని మల్యాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు.