రాజ్యాంగ ఫలాలు అందరు పొందాలి, మేమెంతో మా వాటా అంత- రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఈశ్వరయ్య.

తేది:19-01-2026 తెలంగాణ TSLAWNEWS ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.

హైదరాబాద్: హైదరాబాదులోని AIBCF కార్యాలయంలో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్(AIBCF) సభ్యత్వ నమోదు డ్రైవ్ సందర్భంగా యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సీనియర్ అడ్వకేట్ సంతోష్ కుమార్ గౌడ్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ భారత దేశంలోనే AIBCF అనేది ఒక పెద్ద సంస్థ, ఇది ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అణగారిన వర్గాలకు సంబంధించినదని, దీని యొక్క ముఖ్య ఉద్దేశం “రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలని, మేమెంతో మా వాటా అంతా కావాలని, అందరూ చైతన్య పడాలని ” అనే నినాదంతో మానవత్వంతో కూడిన విలువలతో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలి, అట్టడుగు అణగారిన కులాలను ఉద్ధరింప చేసి అభివృద్ధి చేసినప్పుడు నిజమైన స్వాతంత్ర రాజ్యాంగ ఫలాలు అందుతాయని అందుకు ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. యొక్క కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ సంతోష్ కుమార్ గౌడ్, న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, మెదక్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు స్వామి దాస్, కాన్టెస్టెడ్ ఎంపీ గొల్లపల్లి సాయ గౌడ్, మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *