తేది:19-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా:మెదక్ మండల పరిధిలోని పేరూరు సమీపంలోని మంజీరానదీ తీరంలో వెలసిన శ్రీ సరస్వతీ మాత 24వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల23న(శుక్రవారం)అమ్మవారి సన్నిధిలో అభిషేకం,చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నందున సోమవారం రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు సరస్వతి దేవాలయ వ్యవస్థాపకులు,బ్రహ్మర్షి ధోర్భల రాజ మౌళిశర్మ, ఆలయ ప్రధాన పూజారి దోర్భల మహేష్ శర్మ తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ఉదయము అమ్మవారికి అభిషేక కార్యక్రమము,అలంకరణ దర్శనము,చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసములు,అన్న ప్రసాద సేవ,శకట భ్రమనోత్సవము బండ్లు తిరుగుట,వివిధ గ్రామాలచే ఈకార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భగవద్భక్తులందరూ ప్రతి ఇంట్లో ఉన్న చిన్నారులకు మంచి విద్య బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని ఆ విద్యా తల్లి సరస్వతి మాతను దర్శించి శ్రీ స్వయంభూ సప్తముక నాగమాతను దర్శించి గోత్రనామార్చనలు చేయించుకొని భగవద్భక్తులందరూ శుభ సుఖ సంతోషానందాలను పొందగలరని కోరారు.