తేది:19-1-2026 TSLAWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పధకాలను అందిస్తున్నరాని కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకులు గాడి రమేష్ అన్నారు. సోమవారం రోజున మెదక్ జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 22వ వార్డుకు చెందిన గంగాపురం మోహన్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కు ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతులమీదుగా అందజేశారు.ఎమ్మెల్యే రోహిత్ రావు నాయకత్వంలొ మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కొత్త ఒరవడి నాంది పలికిదని అన్నారు. కార్యకర్తలకు అండగా వుంటు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకోవస్తున్నారని తెలిపారు. గత పాలకులు అవినీతికి పట్టం కట్టారని దోచుకొవడం దాచుకోవడం బి ఆర్ ఎస్ ప్రభుత్వంలొ జరిగిందని దయ్యపాట్టారు. మెదక్ ఖిల్లా పై వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు వెయ్యడం ఖాయం అని చెప్పారు.