తేది:19-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా, హవేలి ఘణపూర్ రిపోర్టర్ తలారి బాలయ్య.
మెదక్ జిల్లా: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక అందజేత.మెదక్ జిల్లా హవెలిఘనపూర్ మండల పరిధిలోని వాడి గ్రామంలో ఈనెల 30వ తేదీన శుక్రవారం రోజున నిర్వహించే శ్రీశ్రీశ్రీ పార్వతి సిద్ధిరామేశ్వర స్వామి వారి దేవాలయ దశమ వార్షికోత్సవానికి రావాల్సిందిగా మాజీ డిప్యూటీ స్పీకర్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మాదేవేందర్ రెడ్డి గారిని వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, సభ్యులు మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన శుభపత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ దశమ వార్షికోత్సవానికి రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్త బృందం సభ్యుబిలు మల్లయ్య, నర్సింలు, రాజులు,మహేందర్,దుర్గయ్య రవి తదితరులు ఉన్నారు.