వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

తేది:19-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, అదనపు కలెక్టర్ సుధీర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్‌తో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, వికారాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో పారదర్శకత, సమర్థతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *