కోనాపూర్ నీటి నిర్వహణ గ్రామసభలో పాల్గొన్న ఏఈ రాజ్ కుమార్.

తేది:19-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం కోనాపూర్ రిపోర్టర్ సిగిరి రాజిరెడ్డి

జగిత్యాల జిల్లా : సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఆకుల రమేష్ అధ్యక్షతన సోమవారం రోజున నీటి నిర్వహణ గ్రామసభ నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్ కుమార్ పాల్గొన్నారని తెలిపారు. కోనాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీరు ప్రతి వార్డుకు అందే విధంగా చర్య తీసుకోవాలని ఏఈ రాజ్ కుమార్ ను కోరారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ 9వ వార్డు 2 వార్డుకు నీరు అందించాలని కోరారు. తగు చర్యలు తీసుకొని స్వచ్ఛమైన నీటిని వాటర్ ట్యాంక్ ద్వారా ప్రతి నెలకు ఒకసారి ట్యాంక్ శుభ్రపరిచి గ్రామంలోని ప్రతి బావిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి నీరు అందించాలని గ్రామసభలో చర్చించారు.ఈ విధంగా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రాగల శివరాత్రి దృష్టిలో పెట్టుకొని భక్తులకు నీటి ఇబ్బందులు కలగకుండా అన్ని వార్డులకు దుబ్బ రాజేశ్వర స్వామికి వచ్చే భక్తులకు నీరు అందుబాటులో ఉండాలని, కార్యదర్శితో గ్రామ ప్రజలతో చర్చించారు. గ్రామ కార్యదర్శి నరేష్ అన్ని వార్డులకు నీరు అందేలా ఉండేలా చర్య తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ మసత్తి శ్రీకాంత్,అలీమ్ ఉపసర్పంచి కిష్టయ్య, భీమయ్య, నరసయ్య, శివప్రసాద్ గౌడ్ మాజీ ప్రజా ప్రతినిధులు శంకరయ్య, అత్తినేని మహేష్, అరవింద్ గౌడ్ భాస్కర్ నాయక్, తోడేటి గంగాధరి, అనంతల స్వామి, చందిగంగాధరి, శ్రీనివాస్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.మొదటి గ్రామసభ విజయవంతంగా అయిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *