తేది:19-01-2026 తెలంగాణ TSLAWNEWS ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ నిధులలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆశయాల సాధన కోసం కేటాయించాలి- మెదక్ జిల్లా బహుజన సమాజ్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు నగులూరి స్వామి దాస్.
తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆశయాలతో కూడిన ప్రగతిని సాధిస్తాం – మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ గొల్లపల్లి సాయ గౌడ్.
ఫ్రీడమ్ ఫైటర్స్ ఆశయాల సాధన తోనే పేదరిక నిర్మూలన సాధ్యం- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
హైదరాబాద్: ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాల సాధనలో భాగంగా ఎంపీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు స్వామి దాస్ గారు మరియు కాంటెంటెడ్ ఎంపీ గొల్లపల్లి సాయ గౌడ్. ఈ సందర్భంలో వారు ఎంపీ ఈటల రాజేందర్ గారితో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ నిధులలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆశయాల సాధన కోసం కేటాయించాలని వినయ పూర్వకంగా తెలియజేస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆశయాల సాధన కోసమై కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఒక లక్ష్యం సాధన తో ఈ యొక్క ట్రస్టు ముందుకు వెళ్తుందని, ఇట్టి ప్రతి విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ ముందుకు నడుస్తుందని అందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు.