తేది:19-01-2026 తెలంగాణ TSLAWNEWS ప్రోప్రేటర్ అండ్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ గౌడ్.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు 2026 ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభం కానున్నట్లు రాజేంద్రనగర్, హైదరాబాద్లోని BIRED ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. రాజేంద్రనగర్లోని Bankers Institute of Rural and Entrepreneurship Development (BIRED) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన యువతకు ఈ శిక్షణలు అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీ నాగరాజకుమార్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యువతకు నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాల వైపు నడిపించడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఉచిత శిక్షణల ద్వారా యువత సాంకేతికంగా బలపడుతూ, శిక్షణ అనంతరం స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయగలుగుతారు” అని పేర్కొన్నారు.
ఉచితంగా అందించనున్న కోర్సులు:
ఏసీ, ఫ్రిజ్ & వాషింగ్ మెషిన్ రిపేర్
మొబైల్ సర్వీసింగ్
ఎం.ఎస్. ఆఫీస్
ఈ కోర్సులు పూర్తిగా ఉచితంగా అందించబడతాయని, ఆసక్తి ఉన్న యువత వెంటనే నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నమోదు కోసం వెబ్సైట్:
🌐 www.bired.org
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
📞 93985 24699
📞 94949 63976
శ్రీ నాగరాజకుమార్
డైరెక్టర్
BIRED ఇన్స్టిట్యూట్
రాజేంద్రనగర్, హైదరాబాద్.