ఈనెల 25వ తేదిన మల్లికార్జున స్వామి కళ్యాణం.

తేది:18-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపనునట్లు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు ఆలయ నిర్వాహకులు మల్లన్న స్వామి వెల్లడించారు.
మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులోని కొయ్య గుట్ట వద్ద చుట్టూరుగా పచ్చని చెట్లు మధ్య వెలిసిన మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులకు కొంగు బంగారం. స్వామి వారి దర్శనం కోసం నిజామాబాదు కామారెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్ పలు ప్రాంతాల నుండి ప్రతీ నెల మోదాటి ఆదివారం,శుక్రవారం భక్తులు వస్తారు. ఈ నెల 25వ తేదీన మల్లన్న స్వామి కళ్యాణం (జాతర) ఈ ఉత్సవాలలొ అగ్ని గుండాలు బోనాలు చెల్లించుట 26వ తేదీన స్వామి వారికి పంచామృతలతో రుద్ర అభిషేకం సహస్ర బిల్వ అర్చన అగ్ని గుండం స్వామి వారికి బోనాలు రాత్రికి ఒగ్గు కధ 27 వ తేదిన రుద్ర అభిషేకం శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాలు వివిధ భక్తి కార్యక్రమలు వుంటాయని ఆలయ అర్చకులు తెలియ జేశారు. స్వామి వారి కళ్యాణం తిలకిచ్చడానికి భక్తులు తరలిరావాలని అయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *