తేది:18- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈనెల 19 నుంచి మార్చి 8వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో మరియు డి పి ఓ జానకి రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని సర్పంచులను మొత్తం ఆరు బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు 100 మంది సర్పంచులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులు సంగారెడ్డి పట్టణంలోని మహిళా ప్రాంగణంలో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ మహిళా శిశు వికాస కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పరిపాలన పరంగా వారి బాధ్యతలు, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018, గ్రామపంచాయతీ పరిపాలన విధులు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.షెడ్యూల్ మేరకు ఆయా తేదీలలో సంబంధిత గ్రామపంచాయతీల సర్పంచులు తప్పనిసరిగా సంగారెడ్డి లోని దుర్గాబాయి దేశ్ముక్ మహిళా శిశు వికాస కేంద్రంలో జరిగే శిక్షణ తరగతులకు హాజరు కావాలని జానకి రెడ్డి కోరారు.