బూత్ నిర్మాణ్ అభియాన్ మండల కార్యశాల సమావేశం.

తేది:18-01-26 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : మల్యాల మండల బిజెపి అధ్యక్షుడు గాజుల మల్లేశం ఆధ్వర్యంలో ఆదివారం ‘బూత్ నిర్మాణ్ అభియాన్- మండల కార్యశాల సమావేశాన్ని నిర్వహించారు. బూత్ స్థాయి బిజెపికి బలమైన పునాది అని, ప్రతి నాయకుడు ముందుగా తమ బూతులను పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా భూత్ నిర్మాణ అభియాన్ కన్వీనర్ సాయిని మల్లేశం అన్నారు. అనంతరం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, సర్పంచులు బొట్ల జయప్రసాద్, సంకుర్తి తిరుపతి, గడ్డం చిన్న మల్లేశం, వకలభరణం మౌర్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *