జగిత్యాల బైపాస్ రోడ్డులో ప్రమాదకరంగా మారిన అండర్ గ్రౌండ్ కెనాల్ – అదుపు తప్పితే అంతే సంగతులు.

తేది:18- 01- 2026 TSLAWNEWS జగిత్యాల రూరర్ రిపోర్టర్ జి తిరుపతి.

జగిత్యాల జిల్లా: జగిత్యాల బైపాస్ తపోవన్ హై స్కూల్ దగ్గర ప్రమాదకరంగా మారింది అండర్ గ్రౌండ్ కెనాల్. కెనాల్ ఛాంబర్ పైన హోల్ తెరిచి ఉండడం వలన వచ్చి వెళ్లే స్కూలు విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. అనేక పెంపుడు శునుకంలు కూడా ఇందులో జారి పడిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇటుగా పశువులు కూడా తిరుగుతాయి. సంబంధిత అధికారులు మ్యాన్హోల్ పై మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *