మెదక్ జిల్లాలో నూతన సర్పంచులకు శిక్షణా బాట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్.

తేది:18-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: శనివారం నాడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం నిర్వహించనున్న శిక్షణా తరగతులకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారు డిపిఓ, జెడ్పి సీఈఓ గారితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా శిక్షణా తరగతులు సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వసతులు, శిక్షణా హాళ్లు, కూర్చునే ఏర్పాట్లు, ప్రొజెక్టర్‌లు, ఆడియో–విజువల్ సదుపాయాలు, త్రాగునీరు, వంటి సౌకర్యాలను సమీక్షించారు.
అలాగే శిక్షణకు హాజరయ్యే సర్పంచులకు గ్రామపంచాయతీల పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన, ఆర్థిక నిర్వహణ, పారదర్శకత, ప్రజాసేవలో బాధ్యతలు వంటి అంశాలపై సమగ్రంగా శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.
శిక్షణా తరగతులు క్రమబద్ధంగా సాగేందుకు షెడ్యూల్‌ను స్పష్టంగా రూపొందించాలని, సర్పంచుల సందేహాలకు నివృత్తి కల్పించేలా అనుభవజ్ఞులైన వనరుల వ్యక్తులను నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు మరింత సమర్థవంతంగా పని చేయగలరని జిల్లా కలెక్టర్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *