తేది:17- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లాలోని అందోల్ _ జోగిపేట్ , గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఇస్నాపూర్ , జిన్నారం , కోహిర్, నారాయణఖేడ్, సదాశివపేట్, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేయడం జరిగిందని అడిషనల్ కలెక్టర్ మాధురి తెలిపారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు మాధురి, ఇంచార్జ్ అడిషనల్ కలెక్టర్ పాండు తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.
జిల్లాలోని సంగారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు, అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులు, గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులు, గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు , ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డులకు, జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు, కోహిర్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు, నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డులకు, సదాశివ పేట మున్సిపల్ పరిధిలోని 26 వార్డులకు, జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 37
వార్డు స్థానాల కోసం ఎస్.సి, ఎస్సీ(మహిళా), ఎస్.టి, ఎస్టీ(మహిళా), బి.సి, బీసీ(మహిళా), అన్ రిజర్వుడు, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీల రిజర్వేషన్లను నిబంధనలను అనుసరిస్తూ ఖరారు చేశారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి 1 వార్డు కేటాయించబడగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 3 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి 2 వార్డులు ఖరారయ్యాయని అడిషనల్ కలెక్టర్ మాధురి తెలిపారు. అదేవిధంగా బీ.సీ జనరల్ కు 7 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు జనరల్ కేటగిరీకి 8 , అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 11 వార్డులు రిజర్వ్ అయ్యాయని వివరించారు.
జహీరాబాద్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 2 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి 2 వార్డు కేటాయించబడిందని ఆమె వెల్లడించారు. బీ.సీ జనరల్ కు 7 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 9, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 10 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
సదాశివపేట మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి ఒక వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. బీ.సీ జనరల్ కు 5 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 5 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 6, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 7 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి రెండు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 3 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 3 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 4, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 2 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 2 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 4, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 4 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి 2 వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి రెండు వార్డులు కేటాయించడం జరిగిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 4 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 4 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 6, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 7 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
జిన్నారం మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి రెండు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 3 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 3 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 4, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
కోహిర్ మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి రెండు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి రెండు వార్డులు కేటాయించడం జరిగిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 2 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 3, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 5 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
గడ్డపోతారం మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి రెండు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 3 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 2 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 3, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
గుమ్మడిదల మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి ఒకటి, ఎస్సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు కేటాయించబడిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 4 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి 4 వార్డులు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 5, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
ఇంద్రేశం మున్సిపాలిటీలో ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డు ఖరారు కాగా, ఎస్సీ జనరల్ కేటగిరీకి మూడు వార్డులు, ఎస్సీ మహిళా కేటగిరీకి రెండు వార్డులు కేటాయించడం జరిగిందని తెలిపారు. బీ.సీ జనరల్ కు 2 వార్డులు, బీ.సీ మహిళా కేటగిరీకి ఒక వార్డు రిజర్వ్ అయ్యాయని, అన్ రిజర్వుడు కేటగిరీకి 3, అన్ రిజర్వుడు (మహిళా) కేటగిరీకి 6 వార్డులు రిజర్వ్ అయ్యాయని తెలిపారు.
ప్రతి మున్సిపాలిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్ కేటగిరీలకు కేటాయించిన వార్డుల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. మహిళలకు రిజర్వ్ చేసిన వార్డులను డ్రా విధానంలో ఎంపిక చేసి ప్రకటించినట్లు తెలిపారు.
రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో జెడ్పి సీఈవో జానకి రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు ,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.