తేది:17- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: ఆందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జనార్ధన్, వట్పల్లి నుండి జోగిపేటకు నడుపుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ జనార్ధన్, బస్సు పల్వట్ల దగ్గరకు రాగానే ఛాతిలో నొప్పి రావడంతో చాకచక్యంగా బస్సును ఆపి దాదాపు 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా పట్పల్లి 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ జనార్ధన్ మృతి చెందాడు.