జహీరాసంఘంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన-TRP సంగారెడ్డిజిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ.

తేది:17-01-2026 సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా, జహీరా సంఘం మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ధనసిరి గ్రామంలో వివిధ పార్టీల నుండి దాదాపు 60 మంది గా చేరారు. అదేవిధంగా పార్టీ యొక్క విధివిధానాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలపరుస్తామని చేరికైనా నాయకులు ఇట్టి సందర్భంలో తెలియజేశారు. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో TRP సంగారెడ్డి జిల్లా యూత్ కార్యదర్శి వరప్రసాద్, మొగుడంపల్లి మండల అధ్యక్షులు శ్రీను, ప్రధాన కార్యదర్శి లతీఫ్, యూత్ ప్రెసిడెంట్ మహేష్, మొగుడంపల్లి మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ సాగర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *