
తేది:17-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా ఐదవ రోజు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ నేతృత్వంలో నిర్వహించారు. మహిళలు, కుటుంబ సభ్యుల భద్రతే ప్రధాన లక్ష్యంగా హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఫోన్ మర్చిపోతే పిల్లలకు గుర్తు చేసే తల్లిదండ్రులు, అదే విధంగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పిల్లలకు చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత అని సూచించారు. హెల్మెట్ తల రక్షణతో పాటు ప్రాణ రక్షణ అని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, ఏఎస్ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.