తేది 17-01-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంTSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలంలోని మేధా పల్లి గ్రామంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి వాహనాలు నడపరాదూ మైనర్ పిల్లలకు సైకిల్ మోటర్ ఇవ్వకూడదు లైసెన్స్ లేకుండా మరియు హెల్మెట్ దరించకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారు . మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ముఖ్యమంత్రివర్యులు డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి వెహికల్ ఉన్న వ్యక్తి యొక్క అకౌంట్ నుంచి డైరెక్ట్ చాలన్ కట్ అయ్యే విధానాన్ని అమ్మలు పరిచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ లైసెన్స్ మరియు హెల్మెట్ ధరించి మద్యం సేవించకుండా రోడ్డుపై వాహనాలు నడపాలని మేదపల్లి గ్రామంలో ఎస్సై క్రాంతి కుమార్ పటిల్ వాహనదారులకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఉప సర్పంచ్ మాజర్ కాంగ్రెస్ నాయకులు అభిలాష్ రెడ్డి కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.