తేది:17-1-2026 TSLAWS మెదక్ జిల్లా,మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: హవేలీ ఘనపూర్ మండలం తొగిట గ్రామ పంచాయతీలోని వివిధ వీధిలలో విజన్ స్వచ్ఛంద సంస్థ సి.ఎస్. ఎం.నవనీత,గ్రామ సర్పంచ్ సౌమ్య శశికాంత్,ఉప సర్పంచ్ కవిత రాము,పంచాయతీ కార్యదర్శి శారద,వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో బాల్యవివాహ నిషేధ చట్టం యొక్క వాల్ పెయింటింగ్ ను తొగిట గ్రామంలో వేశారు.ఈ సందర్భంగా సి ఎస్.ఎం.నవనీత,గ్రామ సర్పంచ్ సౌమ్య శశికాంత్ లు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం గాని చేయించడం గానీ ఎలాంటి అసంఘటిత బాల్య వివాహాలకు పాల్పడితే చిన్న వయసులో చెడిపోతారని అలాగే చట్ట విరుద్ధమని నిషేధ చట్టం గురించి గ్రామ యువకులు మహిళలతో ప్రతిజ్ఞ చేశామన్నారు. గ్రామంలో వాల్ పెయింటింగ్ విజన్ స్వచ్ఛంద సంస్థ సి.ఎస్.ఎం.ఎన్జీవో ల ద్వారా గ్రామంలోవ్రాయించారు.ఈ కార్యక్రమంలో సి.ఎస్. ఎం.నవనీత,గ్రామ సర్పంచ్ సౌమ్య శశికాంత్,ఉప సర్పంచ్ కవిత రాము,గ్రామ పంచా యతీ కార్యదర్శి శారద,వార్డు మెంబర్ యేసు తో పాటు గ్రామ పెద్దలు,మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.