
తేది:17- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా : సీఎం కప్ టార్చ్ ర్యాలీలో భాగంగా అల్లాదుర్గం గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్సై శంకర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా Arrive alive కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రోడ్ యాక్సిడెంట్లు నివారించడానికి డ్రైవింగ్ చేసే సమయంలో సీట్ బెల్టు బైక్పై వెళ్తున్న వారు హెల్మెట్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించే విధంగా ప్రతిజ్ఞ చేశారు. . ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి, తాసిల్దార్ మల్లయ్య, ఎంపీడీవో వేద ప్రకాశ్ రెడ్డి,ఎంఈఓ ఆయా గ్రామాల సర్పంచులు మద్దూరి సౌమ్య సురేష్ గౌడ్, విట్టల్ కవిత, రమ్య భూమ్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వంకిడి రేణుక సిద్దు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీరప్ప, ఉప సర్పంచ్ పాండు, బాలకిషన్ విద్యార్థులు యూత్ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం బస్టాండ్ నుండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు.