తేది:17- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా : ఎంతో అపురూపంగా పెంచుకున్న ఓ శునకం మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించిన ఘటన మల్యాల మండలంలో చోటుచేసుకుంది. కాగా, మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్, ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి తాళ్ల నరేందర్ కు చెందిన పెంపుడు శునకం టామీ మృతి చెందింది. గత 15 సంవత్సరాల నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో శాష్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి ఆ శునకానికి కన్నీటి వీడ్కోలు పలికారు.