తేది:16-01-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి యశ్వంత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాడు. ఇటీవలే మెట్పల్లిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది, ఈ నెల 18న అదిలాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొని మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని గౌడ్ సంఘ సభ్యులు విద్యార్థిని జస్వంత్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొడ్డండ్ల రాజ గోపాల్, గొడ్డండ్ల రాజ శేఖర్ ,బర్ల కిరణ్ ,పోతుగంటి గణేష్ , బర్ల గంగాధర్ ,బర్ల రాజేశం, బర్ల చంద్రశేఖర్, బర్ల జలంధర్, తిరుమల మనోజ్, తోడేటి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.