ఎస్‌ఐఎస్‌ఎఫ్–2026 విజయవంతం చేయాలి, ఎస్‌ఐఎస్‌ఎఫ్–2026 విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.

తేది:16- 01- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లను పరిశీలించిన-జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.

సంగారెడ్డి జిల్లా: సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ (SISF)–2026 రాష్ట్ర, జిల్లా ప్రతిష్టకు కీలకమని, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి సైన్స్ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు.
ఈనెల 19 నుంచి 23 వరకు రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించనున్న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ (SISF)–2026 ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం
జిల్లా కలెక్టర్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంట్రెన్స్, ఎగ్జిట్ మార్గాలు, సైనేజీ ఏర్పాటు, ఎగ్జిబిట్ల సంఖ్య, విద్యుత్ కనెక్షన్లు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. అలాగే సైన్స్ ఫెయిర్‌లో పాల్గొననున్న విద్యార్థులు,ఉపాధ్యాయులు, అతిథులకు అవసరమైన వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సౌత్ ఇండియా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్లు, బ్యాకప్ ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైన్స్ ఫెయిర్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వసతి, భోజనం, రవాణా, భద్రత, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, విద్యుత్, తాగునీరు తదితర కమిటీలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కమిటీ ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రిజిస్టార్, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, నోడల్ అధికారి లింబాజీ, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, విజయ్ కుమార్, పటాన్చెరు తహసిల్దార్, వివిధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *