కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి,పెట్టుబడిదారుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.సదాశివపేట పట్టణానికి జీపు జాత-CITU జిల్లా కార్యదర్శి జి సాయిలు.

తేది:16-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం :కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని పెట్టుబడుదారుల సంక్షేమం తప్ప కార్మికుల సంక్షేమం పట్టని కేంద్ర బిజెపి ప్రభుత్వం పై పోరాటాలు నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు. ఈరోజు సంగారెడ్డి లో ప్రారంభమైన జీపు జాత సదాశివపేట పట్టణానికి రావడం జరిగింది. మోమిన్పేట్ రోడ్ లో సభ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ CITU వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ code లకు వ్యతిరేకంగా , విబిజి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని ,కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఈరోజు సంగారెడ్డి ప్రారంభమైన జాత మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులను కలుస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అన్నారు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబార్దారుల కార్పోరేట్ సంస్థల లాభాల కోసమే పనిచేస్తుంది అన్నారు అనేక సంవత్సరాల త్యాగాల ఫలితంగా ఏర్పడిన కార్మిక చట్టాలను మార్చి పెట్టుబడుదారులకు అనుకూలంగా చట్టాలను తయారు చేస్తుంది అన్నారు ఇది దుర్మార్గ చర్య అని ఆయన తప్పు పట్టారు . గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో విబిజి రాంజీ పథకాన్ని తెచ్చి వ్యవసాయ కార్మికులకు కూలి దొరకకుండా చేసింది అన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఈ పథకంలో ఉంది అన్నారు గతంలో ఉపాధిహామీ పథకం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద 90% రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతంగా ఉండేది అన్నారు. భూస్వాముల ప్రయోజనాల కోసమే ఈ చట్టం తెచ్చింది అన్నారు విద్యుత్ సవరణ చట్టాన్ని తెచ్చి విద్యుత్ రంగాన్ని మొత్తం ప్రైవేటు వారికి అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. కేంద్ర ప్రభుత్వానికి కేవలం పెట్టుబడిదారులు బడా కార్పొరేషన్ సంస్థల యజమానియాలే కంటికి కనిపిస్తున్నాయి అన్నారు.. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను కార్మికులను రైతులను చైతన్యం చేస్తూ ఈ జాత ముందుకు సాగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ సిఐటియు నాయకులు శ్రీనివాస్ మూర్తి నాగరాజు ఇబ్రహీం మునీర్ దశరథ్ నగేష్ యాదమ్మ మైపాల్ వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఏ సబ్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *