సిద్ధిపేటలో బహెన్‌జీ మాయావతి 70వ పుట్టినరోజు సభకు బీఎస్పీ మెదక్ జిల్లా సిద్ధం.

తేది:15-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు బహెన్‌జీ కుమారి మాయావతి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సిద్ధిపేటలో నిర్వహించనున్న సభకు బీఎస్పీ మెదక్ జిల్లా యూనిట్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
ఈ సభకు బీఎస్పీ మెదక్ జిల్లా అధ్యక్షుడు నాగులూరి స్వామిదాస్, అసెంబ్లీ అధ్యక్షుడు గొల్లపల్లి సాయా గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గంటాని శివ నాయకత్వం వహిస్తున్నారు. అలాగే జిల్లా ఇన్‌చార్జ్ ప్రభాకర్, సీనియర్ నాయకులు శంకర్,సుబ్బారావు,ఆనంద్, భాస్కర్ పాటు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు బహెన్‌జీ మాయావతి నాయకత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ, ఆమె చూపిన సామాజిక న్యాయం, సమానత్వం మార్గాన్ని ప్రజల్లో మరింత బలంగా తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఈ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, రానున్న రోజుల్లో బీఎస్పీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయనున్నట్లు నేతలువెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *