తేది:15-01-2026 సిద్దిపేట్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ గంజి భరత్ కుమార్.
సిద్దిపేట జిల్లా:ఈరోజు ఉదయము సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణ 1 వ వార్డ్ పరిధిలోని లింగారెడ్డిపల్లి లో సంక్రాంతి పర్వదిన సందర్భంగా పద్మశాలి సంఘ కార్యవర్గం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 2026 నూతన సంవత్సరపు జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించడం తో పాటు, బీసీ కుల సంఘాలు అన్ని కూడా చేయి చేయి కలిపి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, అందుకు పద్మశాలి కులస్తులు తమవంతుగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే దిశగా కృషిచేసేలా కార్యాచరణ రూపొందించి అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు పంతం పంకజ్ నేత మార్గదర్శనలో ఉపాధ్యక్షులు గంజి భరత్ నేత, గూడూరి రాజు నేత సహాయ కార్యదర్శి, గంజి రాము నేత కోశాధికారి, కార్యవర్గ సభ్యులు పంతం సుధాకర్ నేత, బల్ల రవి నేత, సిరిగాది శేఖర్ నేత, మెర్గు సాయి కిరణ్ నేత, సంఘ పెద్దలు కొండ బ్రహ్మానందం నేత, పంతం రవి నేత, గంజి చంద్రం నేత ఆలయ ప్రధాన అర్చకులు వేముగంటి వంశీ కృష్ణ గార్లు పాల్గొన్నారు.