
తేది:14-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా, సదాశిపేట పట్టణం : సదాశివపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి జీవనం కొనసాగిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నవాబు రాచిరెడ్డి ఒక సీనియర్ జర్నలిస్టుగా నిస్వార్థపరుడుగా తనకంటూ ఏమి ఆశించకుండా తన కలాన్ని గలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమ పోరాటం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఉపయోగించిన మహానీయుడు కీర్తి శేషులు నవాబు రాచిరెడ్డి గారు తేది:14-01-2026 బుధవారం సమయం 3:45 నిమిషములకు స్వర్గీకృతులైనారు, అంత్యక్రియలు,తేది:15-01-2026, సమయం మధ్యాహ్నం 12:00 గంటలకు వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట మండలం, కొత్త కోల్కొంద గ్రామం, స్వగ్రామం నందు జరుపబడును. ఇట్టి విషయం తెలిసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్ లా న్యూస్ ఎడిటర్ అండ్ ప్రోపరేటర్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే,ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ కీర్తిశేషులు నవాబ్ రాచిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని , ఆ భగవంతుని ఆశీస్సులు వారి యొక్క కుటుంబాన్ని చల్లగా చూడాలని సంఘీభావం తెలిపారు, అదేవిధంగా నేటి సమాజానికి జర్నలిజంకు ప్రాణం పోసేందుకు గ్రామ గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, జిల్లాలో, రాష్ట్రాల్లో, జర్నలిజంపై అంకితభావం గల ఇలాంటి జర్నలిస్టులు పుట్టుక రావాలని సంఘీభావం తెలియజేశారు.