తేది:14-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: బీరంగూడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బీరంగూడ గుట్టపై నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణంలో కీలక ఘట్టమైన స్లాబ్ నిర్మాణ పనులు ఈరోజు భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ సర్కిల్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శశిధర్ రెడ్డి, బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ సుధాకర్ యాదవ్‌తో పాటు రమేష్ యాదవ్, లక్ష్మికాంత్ రావ్, మల్లేష్, బిక్షపతి, రామ్ చందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, కృష్ణ యాదవ్, బిళ్ల శీను, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సహకారం, దాతల ఉదారతతో దేవాలయ నిర్మాణం విజయవంతంగా పూర్తవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. ఈ దేవాలయం ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని, భక్తులకు శాంతి–శుభాలు చేకూర్చాలని కోరారు.