తేది:14- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండల ప్రజలకు ఎస్ఐ శంకర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
అల్లాదుర్గం లో గల వివిధ షాపులలో ఎస్సై శంకర్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చైనా మాంజా అమ్ముకూడదని ఒకవేళ ఎవరైనా చైనా మంజ అమ్మినచో ఎవరైనా చైనా మాంజతో కైట్స్ ని ఎగరవేసిన వాటి వల్ల ఎవరికైనా గాయాలైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయనిహెచ్చరించారు. అలాగే పండగ కి ఊరెళ్ళే వాళ్ళు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా బ్యాంక్ లాకర్లో కానీ తెలిసిన వారి దగ్గర గాని పెట్టి వెళ్ళవలసిందిగా, దూర ప్రయాణాలు చేసేటప్పుడు బైక్ అయితే హెల్మెట్ ధరించి జాగ్రత్తగా గమ్యవస్థానాన్ని చేరుకోవాలని తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.