తేది:14-01-2026 TSLAWNEWS నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేశపురం సుమన్.
నిజామాబాద్ జిల్లా: ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని.ఈ సంక్రాంతి ప్రతీ ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకరావాలని ఆకాంక్షించారు..
ప్రజలందరుసుఖసంతోషాలతో సుబిక్షంగా ఉండాలని.పసిడి పంటలతో పరిడ విల్లాలన్నారు.ఈ భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి అని, కనుమ పండగ కనువిందుగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అని భగవంతున్నీ కోరుకున్నారు.ప్రజలందరికి శుభం చేకూరాలని ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు.సంక్రాంతి సందర్బంగా ఎగరవేసే పతంగుల పట్ల చిన్నారులపై తల్లిదండ్రులు ద్రుష్టి పెట్టాలని,తగు జాగ్రత్తలు తీసువాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు.