అల్లాదుర్గం మండలంలోని చిల్వర గ్రామంలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు- ఎస్సై శంకర్.

తేది:13- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా : అల్లాదుర్గం మండలంలోని చిల్వర గ్రామంలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా మంగళవారం రాష్ట్ర డిజిపి గారి ఆదేశానుసారం ప్రకారం Arrive and Alive అనే కార్యక్రమాన్ని ఎస్సై శంకర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు గల కారణములను తెలిపి వాటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మద్యపానం సేవించి వాహనం నడప రాదని హెల్మెట్ ధరించాలి కారు డ్రైవింగ్ సీట్ బెల్టు ధరించాలని డ్రైవింగ్ చేసే ప్రతి వారికి డ్రైవింగ్ లైసెన్ కలిగి ఉండాలని రాంగ్ రూట్లో ప్రయాణం చేయరాదని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆక్సిడెంట్ అయిన తరువాత పడిన అవస్థలను కష్టాలను వాళ్ల ద్వారా అందరికీ తెలిపారు. రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,నేషనల్ హైవే సిబ్బంది, గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్లు యూత్ సభ్యులు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *