అల్లాదుర్గం మండలం ముప్పారం తాండాకు చెందిన శతాధిక వృద్ధురాలు కన్నుమూత.

తేది:13- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం తాండాకు చెందిన నేనావత్ ఉమ్లి బాయి(105) సోమవారం మృతిచెందారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోఆమె శతాధిక వృద్ధురాలిగా జీవించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ఎనిమిది మంది సంతానం 6 మంది మగపిల్లలు,2 ఆడ పిల్లలు ఉండగా.. మనవలు, మునిమనవలను చూశారు.అంబలి, జొన్న రొట్టెలు, రాగి జావ వంటి సంప్రదాయ ఆహారమే ఆమెను సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా ఉండటానికి కారణమని అన్నారు. ఆమె మృతి పట్ల గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ వీరబత్తిని కవిత,విట్ఠల్ వారి కుటుంబానికి పరామర్శించి వారి కుటుంబానికి 5 వేల రూపాయలు నగదుగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *