తేది:13- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ది చెందిన దుబ్బరాజన్న మహాశివరాత్రి జాతర వచ్చే నెల ఫిబ్రవరిలో జరుగుతున్నందు వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ చేయడానికి టెండర్లు వేస్తారు. కానీ
కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండానే చట్టాలకు విరుద్ధంగా తేది: 12- 01- 2026 సోమవారం నాడు వాహనాలు పార్కింగ్ టెండర్ నిర్వహించినట్లు తెలిపారు. కోనాపూర్ సైకిల్ పార్కింగ్ టెండర్లలో గోల్ మాల్ జరిగిందని, ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండానే చట్టాలకు విరుద్ధంగా టెండర్లు జరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, టెండర్లు రద్దు చెయ్యాలని ప్రజల విన్నపం చేశారు.