తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పు డో?

తేది:13-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గము రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వస్తే నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగుల కలలు కన్నీళ్లు గానే మిగిలిపోయే లా కనపడుతున్నాయి. ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం రాజకీయ చదరంగంలో నిరుద్యోగులను తమ బూటకపు మానిఫెస్టోలతో మోసం చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని వారు తెలంగాణలోని పలు కేంద్రాలలో నిరసనలు సైతం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇదిగో అదిగో డిఎస్సి అని 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. ప్రస్తుత రేవంత్ సర్కార్ 20,000 వేల మెగా డీఎస్సీ పోస్టులు వేస్తామని నిరుద్యోగులని నమ్మించి కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన 5000 ఉద్యోగాలకి స్పెషల్ డిఎస్సి ఉద్యోగాలను కలిపి 11000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కొత్తగా కొలువదీరిన సందర్భంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి గత సంవత్సరం ఫిబ్రవరిలో మరో డిఎస్సీ వేస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా నింప లేదు. పైగా రేషనలైజేషన్ పేరుతో పాఠశాలను మూసివేయాలని కుట్ర చేస్తుందని ఉపాధ్యాయ సంఘాలు ,నిరుద్యోగులు , విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేరని ప్రభుత్వం చెబుతున్న గ్రామాలలో పరిస్థితి వేరుగా ఉంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి పాఠశాలలో కేవలం ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారు ప్రాథమిక పాఠశాల అయితే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఎలా బోధిస్తారు అనే ప్రశ్న సైతం గ్రామాలలో ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించిన సందర్భంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. తరగతికి ఒక టీచర్ ని నియమించినప్పుడు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని మేధావులు సైతం చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.ఇదిలా ఉండగా గత సంవత్సరం ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు , ఉపాధ్యాయులు పదవి విరమణ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీని ద్వారా 9,000 కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు సెలవులలో ఉన్న సందర్భంలో పాఠశాలలో కేవలం ఒకరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఒక టీచర్ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆన్లైన్ వర్క్ లాంటివి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకి తమ సమయం సరిగ్గా కేటాయించలేకపోతున్నామనీ ఉపాధ్యాయులు మన సందర్భాలలో ప్రభుత్వాన్ని విన్నవించుకున్న పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లాలో డీఎడ్ పూర్తి చేసిన వారు పదివేల మంది కి పైగానే ఉన్నారు. బిఎడ్ పూర్తి చేసిన వారు సైతం చాలామంది ఉన్నారు. నిరుద్యోగులు డీఎస్సీ కోసం వేయికన్నులతో ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం వస్తుంది, జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ఎదురు చూసిన వారి ఆశలు అడియాశలు చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయుల అరేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
దీని ద్వారా నిరుద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు రేషనలైజేషన్ ప్రక్రియ ప్రభుత్వం విరమించుకోవాలని తరగతికి ఒక టీచర్ ని నియమించి ప్రభుత్వ బడులను కాపాడాలని పేద విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *