మెదక్ బస్‌స్టాండ్ సమీపంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు అవగాహన కార్యక్రమం.

తేది:12-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: ఈ రోజు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా మెదక్ బస్‌స్టాండ్ సమీపంలో మెదక్ టౌన్ సీఐ డి. మహేష్ మరియు కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ డి. మహేష్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, అలాగే ఆటోలలో అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని వాహనదారులకు స్పష్టంగా సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొని, ప్రజలకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతోనే రోడ్లు సురక్షితంగా మారతాయని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *