తేది:12-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని సకాలంలో గుర్తించి, అప్రమత్తతతో స్పందించి ప్రాణాలను కాపాడిన QRT–1 సిబ్బంది ధైర్యసాహసాలను జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు ప్రశంసించారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా, సమయస్ఫూర్తితో వ్యవహరించి మానవత్వాన్ని చాటినందుకు సిబ్బందికి క్యాష్ రివార్డ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య బాధ్యత అని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సాహసోపేతంగా వ్యవహరించిన QRT–1 సిబ్బంది చర్యలు ప్రతి పోలీస్‌కు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. వారి అప్రమత్తత వల్ల ఒక కుటుంబానికి తిరిగి ఆశ వెలిగిందని, సమాజంలో పోలీసులపై నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ డి. మహేందర్ గారు కూడా పాల్గొని, సిబ్బందిని అభినందించారు
ఈ ఘటన పోలీస్ శాఖలోని సిబ్బంది నిబద్ధతకు, మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని, ఇలాంటి సేవలు కొనసాగిస్తూ ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.