జగిత్యాలలో మోసాలకు పాల్పడుతున్న విజేత మాన్ పవర్ కన్సల్టెన్సీ గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్ – దాదాపు 114 పాస్పోర్టులు స్వాధీనం – డిఎస్పీ రఘు చందర్.

తేది:12- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి

Jజగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో మ్యాన్ పవర్ కన్సల్టేన్సీ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన కాముని గంగాధర్ అనే గల్ఫ్ ఏజెంట్ ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. జగిత్యాల పట్టణంలోని డి.ఎస్.పి కార్యాలయంలో డీఎస్పీ రఘు చందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని విజేత మాన్ పవర్ కన్సల్టెన్సీ యజమాని కాముని గంగాధర్ తమకు గల్ఫ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష 40 వేల రూపాయలు వసూలు చేసి విసిట్ వీసాతో మమ్మల్ని మూడు రోజులు బొంబాయిలో ఉంచి అటు నుండి బెహరాన్ పంపించాడు. అక్కడ పని ఉందని చెప్పి ఒక గదిలో మమ్మల్ని నిర్బంధించారు.
అక్కడినుండి వీడియో ద్వారా మా సంబంధికులకు సమాచారం చేరవేయగా ఒక్కొక్కరం దాదాపుగా రెండు నుండి మూడు లక్షల వరకు ఖర్చు పెట్టుకుని తిరిగి దేశానికి వచ్చామని గత నెల 13వ తేదీన ఆరెల్లి రవీందర్ అనే బాధితుడు ఫిర్యాదు చేయగా ఆయన ఫిర్యాదు మేరకు పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల విజేత మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై జగిత్యాల పట్టణ పోలీసులు దాడి చేసి దాదాపు 114 పాస్పోర్టులను, లాప్టాప్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని గంగాధర్ ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ గంగాధర్ నవీన్ అనే వ్యక్తి నుండి లీజు ప్రతిపాదికగా నడుపుతున్నాడు. చట్ట విరుద్ధంగా కన్సల్టెన్సీ లీజుకు ఇచ్చిన నవీన్ పై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.మాన్ పవర్ క్యాన్సల్టెన్సీ లైసెన్స్ రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కోరడం జరుగుతుందని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఇతరుల పాస్పోర్టు తీసుకోవడం నేరం అని డిఎస్పి రఘు చందర్ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, ఎస్సై రవి కిరణ్, పోలీసు బృందం ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *