

తేది:12- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలోని స్వామి వివేకానంద విగ్రహానికి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చీఫ్ మినిస్టర్ కప్ అవగాహనలో భాగంగా టార్చ్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ ర్యాలీ జగిత్యాల పట్టణం నుండి జగిత్యాల జిల్లా వివిధ మండలాలలో కొనసాగుతుందనీ తెలిపారు.
ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతూ:
యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అన్నారు.యువత చెడు అలవాట్లకు మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడల ద్వారా తన భవిష్యత్తును మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం క్రీడల పట్ల ఆసక్తి పెంచుటకు గత రెండు సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ కప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ:
యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
చీఫ్ మినిస్టర్ కప్ 2025 ఈనెల 17 నుండి ఫిబ్రవరి 23 వరకు గ్రామ పంచాయతీల నుండి రాష్ట్రస్థాయి వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ అధికారి రవి కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడలకు సంబంధించిన కోచులు , క్రీడాకారులు, యువకులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.