తేది:11- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామపంచాయతీలో జగిత్యాల పట్టణానికి చెందిన శ్రీ తేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డా.కాడర్ల వేణు కుమార్ ఎంబిబిఎస్ డి ఎన్ బి అర్థో ఆధ్వర్యంలో కీళ్ల నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో మెడ నొప్పులతో బాధపడుతున్న దాదాపు 150 మంది పేషెంట్లకు బిపి పరిశీలించి ఉచిత వైద్యం అందించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణు కుమార్, అభినవ్ చారి మాట్లాడుతూ అల్లిపూర్ గ్రామ ప్రజలు శ్రీ తేజ హాస్పిటల్ ను సంప్రదిస్తే ఓపి లేకుండా ఉచిత వైద్యం, నాణ్యతతో కూడిన వైద్యం అందించబడడంతోపాటు నిరుపేదలకు ఫీజులలో కూడా తగ్గింపు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌతమి వెంకటేష్, అనుమల్ల మల్లేశం,8వ వార్డ్ మెంబర్ అనుమల్ల రాజ్ కుమార్, బత్తుల రాజేందర్ (కరోబార్), రాచర్ల శ్రావణ్, ఎలిగేటి మనోజ్ అనుమల్ల రాజేందర్, మహేష్, రాజశేఖర్, సిరిపురం రాజ్ కుమార్ మహేష్, వేముల సతీష్, పొట్టవత్తిని నాగభూషణం, పోతు సత్యం, దాసరి శేఖర్ యాదవనేని రాజలింగం, చిలువేరి మహేష్ , పాఠక్ సుధీర్, రిపోర్టర్స్ శంకర్, భీమరాజం, మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.