భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్బిట్రేషన్ వ్యవస్థ రిటైర్డ్ న్యాయమూర్తుల చేతుల్లో ఉందన్నారు. ఇప్పుడు మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, అవసరమైన చట్టాలను సైతం మార్పు చేయాలని ఆయన అన్నారు. ఆర్బిట్రేషన్ వ్యవస్థపై రిటైర్డ్ జడ్జీలకు ఉన్నంత పట్టు మరెవరికీ లేదన్నారు.