మూడేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. అందుకే ఇటీవల అక్కడ వ్యాపిస్తున్న న్యుమోనియా కేసులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దేశంలోని ఆరోగ్య కమిషన్ అధికారి మి ఫెంగ్ కొత్త ఇన్ఫెక్షన్లను గుర్తించలేదని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇన్ఫెక్షన్లు ఎక్కువ సంఖ్యలో చిన్నారులకు వస్తున్నాయన్న విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.