సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం.

తేది:10- 1- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా (ప్రైవేట్) ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయింది. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నాయని 8 వ తేదీన వట్టిపల్లి మండలం ఖాదరాబాద్ గ్రామానికి చెందిన కలాలి రవీందర్ గౌడ్ అడ్మిట్ కావడం జరిగింది. సర్జరీ చేసి రాళ్లను తొలగించి, ట్రీట్మెంట్ అయిపోయిందని డిశ్చార్జ్ చేసే సమయానికి ఆరోగ్యశ్రీ అప్రూవల్ కాలేదని తర్వాత రోజు చేస్తామని చెప్పడం జరిగింది.10 తేదీన 11 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లి వస్తుండగా వాంతులు చేసుకొని అక్కడే కుప్పకూలిపోయాడు, అది గమనించిన డాక్టర్లు మళ్లీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎంత ప్రయత్నించినా వ్యక్తిని కాపాడలేకపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యమే అని వారి బంధువులు ఆందోళన చేయడం జరిగింది. ఇది గమనించిన పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకొని ఆందోళనకారులను, బంధువులను, డాక్టర్లను సముదాయించడం జరిగింది. దీనికి డాక్టర్ లే కారణమని ఇంతకుముందు కూడా ఇటువంటి పరిస్థితులు ఆస్పత్రిలో ఎన్నో జరిగాయని ఈ ఆసుపత్రినీ మూసివేయాలని, అక్కడున్న రవీందర్ గౌడ్ కు సంబంధించిన బంధువులు ఆందోళన చేయడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు చెప్పడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *