
తేది:10-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కల్లెడ వద్ద రోడ్డు ప్రమాదంలో వానరుడు మృతి చెందడం జరిగింది. జగిత్యాల నుండి వస్తున్న బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపైన చనిపోయిన వానరుడుని చూసి, నాయకులకు మూగజీవిపై మనసు చలించి, సానుభూతితో వారు వెంటనే ఆగి ఆ మూగ జీవి కోతిని అక్కడే ఉన్నా JCB తో తీసుకెళ్లి ఊరు చివర హిందూ సంప్రదాయం ప్రకారం JCB సహాయంతో గోతి తవ్వించి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుగ్గారం గ్రామ ఉపసర్పంచ్ లావణ్య శ్రీనివాస్, గోపులాపూర్ గ్రామ సర్పంచ్ బీర్పూర్ తిరుపతి, బుగ్గారం మండల గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరస గౌడ్, రాజన్న తదితర నాయకులు జగిత్యాల పాల్గొన్నారు.